ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు
జనగామ రూరల్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలిపారు. మొదటి సెషన్‌లో జనరల్ 161 విద్యార్థులకు 153 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో జనరల్, ఒకేషనల్ 195 విద్యార్థులకు 186 విద్యార్థులు హాజరు కాగా 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరీక్ష నియంత్రణ అధికారులు శ్రీనివాస్ వి.శేఖర్ జఫర్‌గఢ్ జనగామ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఆలయ అభివృద్ధికి విరాళాలు
నర్మెట: మండలకేంద్రంలోని కాకతీయుల కాలం నాటి అతి పురాతన శివాలయం శిథిలావస్థకు చేరుకోగా గంగం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోని ఆలయ కమిటీ భక్తుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టింది. ఇటీవల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను మూడు రోజులు ఘనంగా నిర్వహించారు. కాగా రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాతూరి మల్లారెడ్డి– మాధవి దంపతులు రూ. 2,01,116, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి దేవులపల్లి ప్రభాకర్ –ప్రపుల్ల రూ.51,116, సర్వేయర్ జంగిటి మహేందర్– నిరోషారాణి రూ.25,116, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనందాస్ రాధాకృష్ణ –రమాదేవి రూ.21,116, ఆకుల రాంచందర్– అంజలి రూ.11,116, పాతూరి పద్మారెడ్డి– స్వాతి రూ.10,016 ఆదివారం కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో జంగిటి అంజయ్య, దేవులపల్లి భాగ్యలక్ష్మి ప్రతాప్‌రెడ్డి, నిమ్మ హనుమారెడ్డి, రాజబోయిన లక్ష్మీనారాయణ, వంగ భూపాల్ రెడ్డి, కల్లూరి రాజు, కొండ బాలయ్య మేకల పెద్దాపురం, వేముల రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి
జనగామ రూరల్ : వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎన్‌పీడీసీఎల్ జనగామ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని సెక్షన్–1 విభాగం ఏరియాలో వేసవి ముందస్తు కార్యాచరణలో భాగంగా 63,100,163 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లలో లోపాలు లేకుండా చార్జీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగితా సీజన్‌ల కంటే వేసవిలో విద్యుత్ డిమాండ్ మేరకు తగు సామర్థ్యం కలిగి ఉండేలా ట్రాన్స్‌ఫార్మర్లను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. వినియోగదారులు సైతం విద్యుత్ వినియోగంలో పొదుపు పాటిస్తూ ఎన్‌పీడీసీఎల్ యంత్రాంగం తోడ్పాటుకు పాటుపడాలన్నారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ వేణుగోపాల్, ఏఈ సౌమ్య, సబ్ ఇంజనీర్ మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం
జనగామ రూరల్: రాష్ట్రం మారిన పీడిత ప్రజలకు న్యాయం జరగడం లేదని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి అవపరం ఉందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విజయ గార్డెన్‌లో జిల్లా అద్యక్షుడు పాకాల వెంకన్న ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా ద్వితీయ మహాసభల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గడ్డం లక్ష్మణ్, భారత్ బఛావో నాయకుడు గాదె ఇన్నయ్య పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా.. పేదల బతులకు మారలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రజాఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కడకంచ సంపత్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు
ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment