ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
సొరంగమార్గాలు..
కొండపైనుంచి అదే మండలంలోని కొన్నె గుట్టకు 20 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం, గర్భాలయంలోకి వెళ్లేందుకు గుహలు ఉన్నాయి. రుషులు ఈ సొరంగ మార్గం గుండా వచ్చి స్వయం సిద్ధేశ్వరుడికి పూజలు చేసే వారని ప్రచారంలో ఉంది. కొండ ఉత్తర భాగంలో వంద మీటర్ల దూరం పాక్కుంటూ వెళ్తే విభూతి శివలింగం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని మంచినీళ్లబావి నీరు సేవిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వందల ఎకరాల్లో ఉన్న గుట్టచుట్టూ అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి.
‘ఓంకారనాథాల ప్రతిధ్వని.. భక్తిభావం.. రుషులు నడయాడిన కొండ.. సొరంగ మార్గాలు.. ఏడాది పొడవునా గుండంలో నీళ్లు.. చింతాకు పరిమాణంలో పెరిగే స్వయంభూ శివలింగం’ ఇన్ని ప్రత్యేకతలున్న శైవ క్షేత్రం సిద్ధులగుట్ట బచ్చన్నపేట మండలం కొడవటూరులో ఉంది. సిద్ధుడు అనే మహారుషి కంటికి కనిపించిన పుట్టిలింగమే నేడు స్వయంభూ శైవక్షేత్రాల్లో ఒక్కటిగా వెలుగొందుతోంది. జనగామ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధులకొండపై సిద్ధేశ్వరుడు సుమారు 600 ఏళ్లుగా భక్తుల పూజలందుకుంటున్నాడు. మహిమాన్వితమైన శివలింగం ఏటా చింతాకు పరిమాణంలో పెరుగుతున్నది. కాకాతీయ రాజు తనకు ఇష్టమైన సిద్ధేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని చరిత్ర చెబుతున్నది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ గుట్ట ప్రత్యేకత. కొండపై పాలగుండం, కప్పు గుండం, సూర్యకిరణాలు సోకని గుండం ఇలా మొత్తం ఏడు గుండాలు ఉన్నాయి. ఈ గుండాలలో ఏడాది పొడవునా నీరు ఉండడం స్వామి మహిమకు నిదర్శనం. – జనగామ
● సిద్ధులగుట్టపై ఓంకారనాథ ప్రతిధ్వని ● కొలువైన స్వయంభూ శివలింగం
● ఈ నెల 26న మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబు
ప్రత్యేక బస్సులు.. ప్రైవేట్ వాహనాలు
జనగామతో పాటు వివిధ డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు, బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి 24 గంటల పాటు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే గుట్టపై దత్తాత్రేయ, సరస్వతీ, సాయిబాబా, శ్రీ వాసవీ కన్య కాపరమేశ్వరి, హనుమాన్ ఆలయాలు, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్నదాన సత్రం ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సిద్ధులగుట్టకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండగా ఇందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెంబర్తి గుట్టపై నల్లరాతి శివలింగం..
కాకతీయరాజు పరిపాలనలో జనగామలో ప్రతిష్ఠించిన పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వర స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. 1530 సంవత్సర కాలంలో కాకతీయ సామ్రాజ్యంలో వరుసగా మూడేళ్ల పాటు కరువు సంభవించి ప్రజలు అతలాకుతలమయ్యారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు కాకతీయరాజు 111 శివలింగాలను ప్రతిష్ఠిస్తానని ముక్కంటీశ్వరున్ని వేడుకున్నారు. రాజు విన్నపాన్ని కై లాస వాసుడు కరుణించడంతో కాకతీయ సామ్రాజ్యంలో శివలింగాలను ప్రతిష్ఠించి రాజు మొక్కులు తీర్చుకున్నాడు. అందులో భాగంగానే జనగామ మండలం పెంబర్తి కొండపై చెక్కిన శివలింగాన్ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర (మహదేవ) దేవాలయంలో ప్రతిష్ఠించారు. 2015లో ఆలయ పునప్రతిష్ఠాపన సమయంలో నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్, పురావస్తుశాఖ అధికారుల ఆధ్వర్యంలో శివలింగాన్ని బయటకు తీశారు. శివలింగం ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు, బరువు ఎంత అనే దానిపై పురావస్తుశాఖ స్పష్టమైన ప్రకటన చేసింది. పెంబర్తి కొండపై చెక్కిన నల్లరాతి శివలింగం బరువు 42 వందల కిలోల బరువుగా లెక్కించారని భక్తులు చెబుతుంటారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమేశ్వర ఆలయం ముస్తాబు
పాలకుర్తి టౌన్: మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ముస్తాబు అయింది. ఆదివారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో ఆలయం ఆకట్టుకుంది. ఈనెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
Comments
Please login to add a commentAdd a comment