రఘునాథపల్లి: పేదలకు ఉపయోగపడే విధంగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద వినూత్న ఆర్థోపెడిక్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రి డైరెక్టర్లు మల్లారెడ్డి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ గోపిచంద్‌లను శాలువాతో సత్కరించి అభినందించారు. సుమారు 205 మంది వైద్యపరీక్షలు చేయించుకోగా వారికి ఉచితంగా మందులు అందజేశారు.
జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment