దేవరుప్పుల: ఈ నెల 28న తలపెట్టిన చలో ఢిల్లీ స దస్సును జయప్రదం చేయాలని సీపీఐ (ఎం,ఎల్) మాస్ లైన్ ఆలిండియా కమిటీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గడ్డం సదానందం ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బీజేపీ సర్కారులో ప్రజల మధ్య విద్వేషాలు, కుల, మతాలను ప్రేరేపిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ పరివార్ శక్తులు, మోదీ ప్రభుత్వం లౌకికవాదంపై దాడులు చేస్తుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టేందుకు వామపక్షభావజాల శక్తులు ఏకం కావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment