మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Published Tue, Feb 25 2025 1:45 AM | Last Updated on Tue, Feb 25 2025 1:42 AM

మంగళవ

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

‘పన్ను కట్టు.. గిఫ్ట్‌ పట్టు’

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

ఇంటి, నల్లా పన్ను వసూళ్లలో వందశాతం లక్ష్యం మార్చి 31 వరకు చేరుకున్న ఐదుగురు ఉద్యోగులు, సిబ్బందికి ఏప్రిల్‌ 1వ తేదీన ఉత్తమ అవార్డుతో పాటు నగదు బహుమతి అందిస్తామని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా పేర్కొన్నారు. అలాగే పన్ను చెల్లింపులో ముందు వరుసలో ఉన్న యజమానుల రశీదులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మార్చి 8న బహుమతులు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు.

యూరియా కొరత లేదు

నర్మెట: ప్రస్తుతం సాటు చేసిన పంటలకు యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్‌ అన్నారు. స్థానిక ఫర్టిలైజర్‌ షాపులను సోమవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. వంద మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరమైన రైతులు కొనుగోలు చేయవచ్చని చెప్పారు. అధికారి వెంట ఏఓ మనోహిత్‌ విక్రమ్‌రావు తదితరులు ఉన్నారు.

48 గంటలు వైన్స్‌ బంద్‌

జనగామ: ఖమ్మం–వరంగల్‌–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం(నేడు) సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల పాటు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. దీంతో బీర్లు, లిక్కర్‌ సేల్‌ ఒక్కసారిగా పెరిగింది. బెల్ట్‌ దుకాణాదారులు రోజువారీ కంటే అదనపు స్టాక్‌ సమకూర్చుకుంటున్నారు.

ఆక్రమించుకున్న భూమి దళితులకు ఇప్పించాలి

పాలకుర్తి టౌన్‌: మండల పరిధి మంచిప్పుల గ్రామంలో దళితుల భూములను ఆక్రమించుకున్నవారి నుంచి తిరిగి ఇప్పించాలని సాధిక్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయవాది సాధిక్‌ అలీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిష న్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యను కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో ఆయనకు వినతి పత్రం అందజేశారు. దళితుల భూముల్లో గత ప్రభుత్వం అక్రమంగా డబుల్‌ బెడ్రూంలు నిర్మించిందని, వాటిలో బాధితులు తల దా చుకుంటే.. ఆ ఇళ్లకు కరెంటు, తాగునీరు ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్నారని సాధిక్‌ అలీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌ మంచుప్పుల గ్రామాన్ని సందర్శించాలని కోరారు. ఆయన వెంట దళిత బహుజన ప్రంట్‌ రాష్ట్ర సభ్యులు శంకర్‌, తదితరులున్నారు.

హస్తకళలతో స్వయం ఉపాధి

స్టేషన్‌ఘన్‌పూర్‌: హస్తకళలను నేర్చుకోవడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందాలని ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టి.శ్రీనివాస్‌రావు అన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యాన హస్తకళల శిక్షణ తీసుకున్న మహిళలకు స్థానిక ఎస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో సోమవారం ‘బాబిన్‌ లేస్‌ క్రాస్‌ స్టిచ్‌’పై ఒక్కరోజు సెమినార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హస్తకళల అభివృద్ధికి ఏపీసీసీ ద్వారా ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నామని, ఆసక్తి ఉన్న మహిళలకు హ్యాండీక్రాఫ్ట్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. బాబిన్‌ లేస్‌ కళ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు వెబ్‌సైట్‌ తయారు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మహిళలు వినూత్న డిజైన్‌లతో ఆకట్టుకుంటూ మార్కెటింగ్‌ రంగంలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జాతీయ సలహాదారుడు హెచ్‌కే.చారి, పీడీ సుధీర్‌కుమార్‌, ఖాజామొయీనొద్దీన్‌, విజయసాగర్‌రెడ్డి, శ్రీధర్‌, హస్తకళా కారులు జీడి ప్రసాద్‌, నీరటి శోభ, ఎడ్ల సులోచన, విమల, నిర్మల, తేరీజ, యాదమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ పాలన అస్తవ్యస్తం

మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం

సీడీఎంఏ మందలించినా మార్పు లేదు

తరుముకొస్తున్న మార్చి 31 డెడ్‌లైన్‌

రంగంలోకి దిగిన కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

‘పన్ను కట్టు.. గిఫ్ట్‌ పట్టు’

ఉద్యోగులు, యజమానులకు నజరానా

జనగామ: పురపాలిక అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల నుంచి వచ్చే నిధులతో పాటు ఆస్తి, నల్లా పన్నులు ఎంతో కీలకం. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం కారణంగా మున్సిపల్‌ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. వార్డుల్లో ప్రజలకు కనీస మౌలిక వసతి సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సిన అధి కారులు.. వాటిని విస్మరించారు. పురపాలికకు రావలసిన పన్నుల వసూలుపైనా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. సీడీఎంఏ అధికారులు మొట్టికాయలు వేసినా.. కలెక్టర్‌ హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెల ఐదురోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు పన్ను డిమాండ్‌లో 40 శాతం కూడా వసూలు కాలేదు. దీంతో కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జనగామ మున్సిపల్‌ పరిధిలో గృహాలు, వాణిజ్య సంస్థలు 15,414 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఆస్తి పన్ను డిమాండ్‌ రూ.5.71కోట్ల మేర ఉంది. ఇప్పటి వరకు రూ.2.27కోట్లు(39.80శాతం) మాత్రమే వసూలు చేశారు. రూ.3,43,89,000 రావాల్సి ఉంది. పురపాలిక 30 వార్డుల పరిధిలో 13,696 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఏటా పన్ను డిమాండ్‌ రూ.1.66 లక్షలు ఉంటుంది. ఇప్పటి వరకు రూ.18.22లక్షలు(10.95) మాత్రమే వసూలైంది. రూ.1.48కోట్ల మేర బకాయి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెల ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

పదేళ్లు.. 11 మంది కమిషనర్లు

పురపాలన అస్తవ్యస్తంగా మారడానికి ముఖ్యంగా కమిషన్లు కుదురుగా లేకపోవడం కారణంగా చెప్పవచ్చు. 2014 నుంచి ఇప్పటి వరకు 10 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారు.. ఏసీబీ ట్రాప్‌లో చిక్కిన వారు.. రెగ్యులర్‌ అధికారులు ఇందులో ఉన్నారు. 2014 నుంచి 2016 వరకు కమిషనర్‌ సత్యనారాయణ, 2016–17 కె.బలరాం, 2017–18 ఈశ్వరయ్య, 2018లో ఒక నెల పాటు అప్పటి డీఈ కె.రవికిరణ్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. 2018–20 నోముల రవీందర్‌, 2020–21 సమ్మయ్య, 2021లో రెండు నెలలు డీఈ చంద్రమౌళికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు, 2021–22 వరకు నర్సింహ పని చేశారు. 2022 నుంచి 7 నెలల పాటు రవీందర్‌యాదవ్‌ పనిచేయగా, 2022–23 వరకు రజిత బాధ్యతలు నిర్వర్తించి ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ తర్వాత ప్రస్తుత కమిషర్‌ ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు.

ఎమ్మెల్యే కోటా కింద

పెద్దలసభకు వెళ్లేదెవరు..?

ఉమ్మడి వరంగల్‌లో జోరుగా ఊహాగానాలు

సత్యవతి రాథోడ్‌కు మళ్లీ చాన్స్‌

దక్కేనా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి

దయాకర్‌రావు పేరు?

కాంగ్రెస్‌ పార్టీ కోటాలో

పెరుగుతున్న ఆశావహులు

తెరమీదకు అసెంబ్లీ ఎన్నికల హామీలు..

పావులు కదుపుతున్న సీనియర్లు

న్యూస్‌రీల్‌

సర్కారు శాఖలపై దృష్టేది..?

వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పురపాలికకు ఆస్తి పన్ను రూ.1.09కోట్ల మేర రావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి పన్ను వసూలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యా రు. సామాన్య ప్రజలు ఏడాది పన్ను పెండింగ్‌ ఉంటే.. ఇంటి వద్దకు వెళ్లి హడావుడి చేసే సిబ్బంది.. సర్కారు కార్యాలయాలు ఏళ్ల తరబడి చెల్లించకున్నా ఎందుకు మినహాయింపు ఇస్తున్నారనే ప్రశ్నను ప్రజలు లేవనెత్తుతున్నారు. తహసీల్‌ కార్యాలయం రూ.17.38 లక్షలు(1997–98 నుంచి), జిల్లా ఆస్పత్రి(రూ.3.39లక్షలు(1996–97 నుంచి), ఆర్‌అండ్‌బీ అతిథి గృహం రూ.5.12 లక్షలు(2005–06 నుంచి), పంచాయతీ రాజ్‌ రూ.8.47 లక్షలు(2006–07 నుంచి), ఎంపీడీఓ, జెడ్పీ రూ.10.24 లక్షలు(2013–14 నుంచి), పీడబ్ల్యూడీ ఐబీ రూ.1.49 లక్షలు (2000–01 నుంచి), వ్యవసాయ మార్కెట్‌ రూ.6.79 కోట్లు(2022–23 నుంచి), గోదాంలు రూ.12,230 (2024–25 నుంచి), వీవర్స్‌ కాలనీ లోని హ్యాండ్లూ, టెక్స్‌టైల్స్‌ కార్యాలయం రూ.54,788 (2023–24 నుంచి), కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసు రూ.4.98లక్షలు (1995–96 నుంచి), హౌసింగ్‌ బోర్డు రూ.2.88లక్షలు(2002–03 నుంచి), ఆర్డీఓ కార్యాలయం రూ.8.75లక్షలు(2009–10నుంచి), గిర్నిగడ్డ గోదాం రూ.4.53 లక్షలు (2015–16 నుంచి), పోస్టాఫీస్‌ రూ.5.84లక్షలు (2004–05 నుంచి), బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.8.84లక్షలు (2019–20 నుంచి), ఆర్టీసీ రూ.3.22లక్షలు (2024–25 నుంచి), అటవీ శాఖ రూ.7.39 లక్షలు (2002–03 నుంచి), ఐసీడీఎస్‌ రూ.1.09లక్షలు (2017–18 నుంచి), సోషల్‌ వెల్ఫేర్‌ రూ.48,156 (2023–24).. ఇలా మరికొన్ని శాఖల నుంచి పురపాలికకు ఆస్తి పన్ను బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20251
1/6

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20252
2/6

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20253
3/6

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20254
4/6

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20255
5/6

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20256
6/6

మంగళవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement