పోలింగ్ విధులపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: పోలింగ్ విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈనెల 27న జరిగే వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ విధానంపై సంబంధిత అధికారులకు నిర్వహించిన రెండో విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. జిల్లాలోని 12 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరా లను ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం(నేడు) ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో ఎన్నిక ల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని, అధికారులు, సిబ్బంది సకాలంలో చేరుకోవాలని చెప్పారు. ఓటర్లు ఓటు వేయడానికి వచ్చిన సమయంలో వెంట తెచ్చుకున్న గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డు చివరి 4 అంకెలను సంబంధిత ఫార్మెట్‌లో నమోదు చేయాలన్నారు. దివ్యాంగ ఓటర్లకు సంబంధించి 18 ఏళ్లు నిండిన వారిని సహాయకులుగా అనుమతించా లని, కుడి చేతి చూపుడు వేలికి సిరా వేసి, సంబంధి త ధ్రువీకరణ తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రారంభమైన సమయం నుంచి ప్రతీ రెండు గంటలకు ఒకసారి నమోదైన ఓటింగ్ వివరాలను పైఅధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సామగ్రిని జాగ్రత్తగా నిర్దేశిత ప్రదేశాలకు చేర్చాలని చెప్పారు. ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఏఓ మన్సూరీ పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయించొద్దు●
జనగామ: ఫర్టిలైజర్స్ దుకాణాదారులు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని కావేరి, సాయిరాం ఫర్టిలైజర్స్, జేకేఎస్ అగ్రిమాల్‌ను డీఏఓ రామారావుతో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల దిగుమతి, కొనుగోలు వివరాల రిజిస్టర్లను పరిశీలించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులతో పాటు రశీదు ఇవ్వాలని, రికార్డు ల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పారు. నకిలీ ల జోలికి వెళ్ల వద్దని, నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని సూచించారు. అనంతరం ఎరువుల నిల్వ గోదాంలను సందర్శించి యూరియా, ఇతర స్టాక్.. రిజిస్టర్లలో వివరాలను పరిశీలించారు. సాయిరాం ఫెర్టిలైజర్స్ షాపులో ధరల డిస్‌ప్లే బోర్డు లేకపోవడంతో యజమానిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిమానా విధించా లని డీఏఓను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులతో అధిక ధరల గురించి ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment