‘సేవ్ బర్డ్స్’ చాలెంజ్‌కు అనూహ్య స్పందన
జనగామ: వేసవిలో పక్షుల దాహార్తి, ఆకలి తీర్చేందుకు అమ్మ ఫౌండేషన్ ఇచ్చిన చాలెంజ్‌కు మానవతా వాదులు స్పందించారు. ‘సేవ్ బర్డ్స్’ శీర్షికన ఈనెల 24న సాక్షిలో ప్రచురితమైన కథనం సోషల్ మీడియాలో ప్రముఖంగా నిలిచింది. అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారు వంగ భీమ్‌రాజ్ హైదరా బాద్ బోయినిపల్లిలోని తన ఇంటిపై గింజలు, గిన్నెలో తాగునీరు పోసి చాలెంజ్ స్వీకరించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన కొండా చక్రపాణి, హనుమకొండకు చెందిన వేణుగోపాల్, యాదాద్రి, జనగామకు చెందిన పలువురు పక్షుల ప్రాణాలను కాపాడడంలో తమవంతు పాత్ర ఉంటుందని అమ్మ ఫౌండేషన్‌కు లేఖ రాస్తూ.. ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలి పారు. పక్షుల రక్షణలో భాగస్వామ్యులు కావాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మణి కోరారు.
‘సేవ్ బర్డ్స్’ చాలెంజ్‌కు అనూహ్య స్పందన
‘సేవ్ బర్డ్స్’ చాలెంజ్‌కు అనూహ్య స్పందన
‘సేవ్ బర్డ్స్’ చాలెంజ్‌కు అనూహ్య స్పందన
‘సేవ్ బర్డ్స్’ చాలెంజ్‌కు అనూహ్య స్పందన
Comments
Please login to add a commentAdd a comment