కేసుల పరిష్కారానికి సహకరించాలి
● జనగామ సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
జనగామ రూరల్ : జిల్లాలో అపరిష్కృత పెండింగ్ కేసుల పరిష్కారానికి అనుబంధ యంత్రాగం సహకరించాలని జనగామ సీనియర్ సివిల్ జడ్జి ఇ.విక్రమ్ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జడ్జి విక్రమ్ మాట్లాడారు. మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా పాటుపడాలన్నారు. రాజీ పడతగిన క్రిమినల్, సివిల్ కేసుల్లో న్యాయవాదులతో పాటు కక్షిదారులు సామరస్యంగా సెటిల్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎనగందుల చంద్రఋషి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment