జనగామ రూరల్: మహిళలు అభివృద్ధి సాధించా లి.. ఇందుకు వారికి అవసరమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత మహిళా సాధికారతపై ఈనెల 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న వారోత్సవాల పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆయన విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, మహిళా దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీధర్, డీఆర్‌డీఓ వసంత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment