ఎల్‌ఆర్‌ఎస్
ఎట్టకేలకు
సాక్షిప్రతినిధి, వరంగల్/జనగామ:
అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్‌లతో పాటు మున్సిపల్ కమిషనర్‌లు, జిల్లాల ఉన్నతాధికారులకు మార్గదర్శకాల ఉత్తర్వులు కూడా అందాయి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మార్చి నాటికి దాదాపుగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు.
దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అంతా సిద్ధం..
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొదటగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వివిధ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లోనే వడపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారుడు పూర్తిస్థాయిలో పత్రాలు సమర్పించాడా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు, వివిధ గ్రామాలనుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తూ.. ఆ ప్లాటు, స్థలం వద్దకు రమ్మని జీపీఎస్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని చెబుతున్నారు. చివరగా మరోసారి వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాల పరిశీలన చేసినా అభ్యంతరాలు అలాగే ఉంటే వాటిని తిరస్కరించి సమాచారం ఇస్తామంటున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావాల్సిన పత్రాలతోపాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి.. దరఖాస్తులు సరైనవి అయితే క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
అందరికీ సమాచారం అందేలా ఏర్పాట్లు...
ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 31 వరకు కొనసాగగా, రూ.1000 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,58,097 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,840 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అప్పట్లోనే కొన్ని క్రమబద్ధీకరణ చేయగా.. 1,47,257 వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ అమలుకు కదిలింది. ఈసారైనా నిబంధనల ప్రకారం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
10,840
వివిధ స్థాయిల్లో పెండింగ్
1,47,257
మొత్తం దరఖాస్తులు: 1,58,097
కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు
జిల్లా మున్సిపాలిటీ మొత్తం ఆమోదం వివిధ స్థాయిల్లో
గ్రేటర్‌వరంగల్ కార్పొరేషన్ 1,00,989 2,756 98,233
హనుమకొండ పరకాల 3,194 06 31,88
వరంగల్ నర్సంపేట 5,219 411 4,808
వర్ధన్నపేట 524 10 514
మహబూబాబాద్ మహబూబాబాద్ 12,201 566 11,635
డోర్నకల్ 872 241 631
మరిపెడ 2,629 63 2,566
తొర్రూరు 10,299 606 9,693
జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,795 1214 2,581
జనగామ జనగామ 18,375 4,967 13,408
ఎల్‌ఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment