శివ పూజకు వేళాయె..
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు
నేడు మహాశివరాత్రి పర్వదినం
● వేలాదిగా తరలిరానున్న భక్తులు
● జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన ఆలయాలు
జనగామ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలన్నీ విద్యుత్ దీపాల వెలుతురులో కాంతులీనుతున్నాయి. శివ, దేవేరి పార్వతి వివాహం కూడా ఇదే రోజున జరగనుంది. జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరగనున్నాయి.
కలెక్టర్ పర్యవేక్షణ..
ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు శ్రమిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుకుండా ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ పర్యవేక్షణలో ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయాల ప్రాంగణంలో పరిశుభ్రత పాటించే విధంగా డీపీఓ నాగపురి స్వ రూప ఆధ్వర్యంలో డీఎల్‌పీఓ, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
వేలాదిగా తరలిరానున్న భక్తులు
జిల్లాలోని శివాలయాలు నేడు శివనామ స్మరణలతో మారుమోగనున్నాయి. మహాశివరాత్రి ని పురస్కరించుకుని పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధులగుట్ట, పట్టణంలోని పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వరస్వామి, జనగామ మండలం చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వరాలయాలతో పాటు పలు ఆలయాలకు వేలా ది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలు గకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
– 8లోu
Comments
Please login to add a commentAdd a comment