టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ రూరల్: పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి టెన్త్ వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పది పరీక్షలకు 41 సెంటర్లలో 6,238 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒకరు చొప్పున 41 సిట్టింగ్ స్క్వాడ్‌లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు సందేహాల నివృత్తికి 9000293231, 99 89544981 కంట్రోల్ రూం నంబర్‌ను అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, ఏసీజీఈ రవి కుమార్, డీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ రామరాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పండుగకు ఏర్పాట్లు చేపట్టాలి
రంజాన్‌కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ మాసం నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. మతపెద్దలు సూచించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణకు
కట్టుదిట్టమైన చర్యలు
జనగామ: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ మత్తు పదార్థాల నియంత్రణపై విద్య, వ్యవసాయ, ఎకై ్సజ్, పోలీసు, వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థల్లో ప్రతీ శుక్రవారం నిర్వహిస్తున్న బ్యాగ్ డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీఏఓ రామారావు నాయక్, డీఈఓ రమేష్, కలెక్టరేట్ ఏఓ మన్సూరి, అధికారులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
ప్రభుత్వ చేయూతతో మహిళలు ఆర్థిక పురోగతి సా ధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జనగామ మున్సిపల్ కార్యాలయం పక్కన ఇందిరా మహిళా శక్తి పథకంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు.
జిల్లాలో 41 సెంటర్లు,
6,238 మంది విద్యార్థులు
సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment