రెడ్ నోటీసులు రెడీ!
జనగామ: జనగామ పురపాలికలో వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికార యంత్రాంగం దృష్టి సారింది. ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఆస్తి జప్తు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నారు. శ్రీబకాయిలు ఫుల్.. వసూళ్లు పూర్‌శ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా స్పందించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఏసీ), పురపాలిక స్పెషల్ ఆఫీసర్ పింకేష్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు, పన్నులు వసూళ్లు చేసే ఉద్యోగులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వందశాతం పన్నులు వసూళ్లు లక్ష్యంగా గత నెల కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి దిశా నిర్ధేశం చేసినా..ఆశించిన మేర టార్గెట్ ఎందుకు చేరుకోలేక పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంటింటి సర్వే నేపధ్యంలో కాస్త వెనకబడి పోయామని ఉద్యోగులు వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. మార్చి 31 వరకు వందశాతం పన్నులు వసూళ్లు కావాల్సిందేనని ఆదేశించారు. మొండిబకాయిదారుల జాబితా సిద్ధం చేసి, అవసరమైతే వారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసు అందించిన రెండు, మూడు రోజుల్లో స్పందన కనిపించకపోతే ఆస్తులను జప్తు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు జప్తు వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు వ చ్చినట్లు తెలుస్తుంది. 10 నుంచి 30 వేల వరకు రెడ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఏసీ సమీక్ష పూర్తవగానే ఉద్యోగులు పన్నుల వసూళ్లకు వార్డుల పర్యటన బాట పట్టారు. రోజువారీగా వసూళ్లకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో అందించాలని కమిషనర్‌ను ఏసీ ఆదేశించారు.
మొండిబకాయిదారులకు
ఇవ్వనున్న అధికారులు
ఆస్తి జప్తులకు వాహనాలు సిద్ధం!
పన్నుల వసూళ్లలో జాప్యంపై
కలెక్టర్ ఆరా
పురపాలికలో ఏసీ సమీక్ష
రెడ్ నోటీసులు రెడీ!
Comments
Please login to add a commentAdd a comment