జనగామ: జిల్లాలో కోతల్లోని కరెంటు సరఫరా అందించేందుకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కలెక్టర్ సందర్శించారు. సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే వ్యవసాయం పంపు సెట్లతో పాటు వివిధ కాలనీలకు సరఫరా చేసే విభాగాలను పరిశీలించారు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డుల్లో వివరాలను నమోదు చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. విద్యుత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజలకు అందుబాటులో ఉండి, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, టెక్నీకల్ డీఈ గణేష్, ఏడీఈ జనగామ ఆపరేషన్ వేణుగోపాల్, పట్టణ ఏఈ–2 పి.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment