రోడ్డెక్కిన అన్నదాత
జనగామ రూరల్: యాసంగి సిజన్‌లో సాగు చేసిన వరి పంటకు నీరు లేక ఎండి పోతుండడంతో కడు పు మండిన అన్నదాతలు రోడ్డెక్కారు. గోదావరి జలాలు విడుదల చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలంలోని పెద్దపహా డ్, గోపిరాజుపల్లి, గానుగుపహాడ్, ఎర్రకుంటతండా, వడ్లకొండ గ్రామాలకు చెందిన రైతులు గురువారం జిల్లా నీటి పారుదల శాఖతోపాటు కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎండిన వరితో ఆందోళనకు దిగారు. మండల పరిధి 21 గ్రామాల్లో యాసంగి వరి 20వేల ఎకరాల్లో సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుంచి చుక్క నీరు రావడంలేదు. 300 ఫీట్ల లోతుకు బోరు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చేతి కొచ్చే దశలో పంట ఎండిపోయో పరిస్థితి నెలకొనడంతో రైతులు రోడ్డెక్కారు. గండిరామారం నుంచి పంపింగ్ చేసి బొమ్మకూరు రిజర్వాయర్ కాల్వల ద్వారా నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాల ని రైతులు కోరారు. సకాలంలో నీరు రాకపోతే పంట పొలాలను పశువులకు మేతగా వదలాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో నీరు వదులుతాం..
ఈ సందర్భంగా ఇరిగేషన్ ఈఈ మంగీలాల్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో నీళ్లు వదులుతామ ని చెప్పారు. సీఐ దామోదర్ ధర్నా వద్ద చేరుకుని రైతులను శాంతింప జేశారు. ఈ నిరసనలో ఆయా గ్రామాల రైతులు, మాజీ సర్పంచ్‌లు శానబోయిన శ్రీనివాస్, బొల్లం శారద, ఎడమ అయిలయ్య, కొర్ర శంకర్, కూకట్ల సిద్దిరాజు, కూకట్ల సత్తయ్య, మాలోతు రాజు, తులసీరాం, జయరాం, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
ఎండిన వరితో నిరసన
గోదావరి జలాలు విడుదల చేయాలని
ఇరిగేషన్, కలెక్టరేట్ వద్ద ఆందోళన
మంత్రులు పట్టించుకోవడం లేదు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
గోదావరి జలాలతో గతంలో జిల్లా సస్యశామలం అయింది.. వరి పంట పుష్కలంగా సాగు చేశారు.. నేడు పంట ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతులు ఎమ్మెల్యేను ఆయన నివాసం వద్ద కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. పెట్టుబడులకు అప్పులు చేసి.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చివరి దశలో నీరు లేక ఎండిపోతోందని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాను మంత్రులు పట్టించుకోవడం లేదని, అసలు గండిరామారం నుంచి పంపింగ్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా నేడు పంటలకు ఈ పరిస్థితి వచ్చిందని, తక్షణమే కాల్వల ద్వారా నీరందించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రోడ్డెక్కిన అన్నదాత
Comments
Please login to add a commentAdd a comment