వసూళ్లకు 30 టీంలు
జనగామ: జనగామ మున్సిపాలి టీలో దీర్ఘకాలికంగా బకాయి ఉన్న ఇంటి, నల్లా పన్నుల వసూళ్లలో మరింత వేగం పెంచేందుకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్వయంగా రంగంలోకి దిగారు. ‘పన్నుల వసూళ్లలో పూర్’.. ‘రెడ్ నోటీసులు రెడీ’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు కలెక్ట ర్ స్పందించారు. గురువారం కమిషనర్ వెంకటేశ్వర్లతో కలిసి వ్యాపార, వాణిజ్య సంస్థల యజమాను ల వద్దకు వెళ్లి పెండింగ్ ఆస్తిపన్ను చెల్లించాలని కోరగా.. వారు తక్షణమే స్పందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణా భివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు 95 శాతానికి చేరుకోగా.. మున్సిపల్ పరిధిలో పాతవి, కొత్తవి కలుపుకుని ఆస్తి పన్ను రూ.5.71కోట్లు ఉండగా.. రూ.2.32 కోట్లు(40.63 శాతం) వసూలు చేశారు. పురపాలికలో నూరు శాతం పనుల వసూలు లక్ష్యంతో 30 మంది వార్డు ఆఫీసర్లు, సూపర్‌వైజర్లతో యాక్షన్ టీంలను రంగంలోకి దింపినట్లు కలెక్టర్ వివరించారు. ఇంటి పన్నులు ఆరు నెలలకోసారి, ఫైనల్‌గా ఏడాది లోపు చెల్లించాలని సూచించారు.
వారం రోజుల్లో చెల్లించకుంటే..
ఏళ్ల తరబడి పన్ను బకాయి ఉన్నవారి జాబితా ప్రకారం రెడ్ నోటీసు జారీ చేసి వారం రోజుల్లోపు చెల్లించని పక్షంలో ఆస్తులను సైతం జప్తు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుల్లో క్లియర్‌గా ఉండాలని, సిటిజన్ రెస్పాన్స్ తప్పనిసరి అని పేర్కొన్నారు. భవనాలు విక్రయించాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. ప్రభుత్వం పథకాలు పొందాలన్నా ఇంటి, నల్లా పన్నులు క్లియరెన్స్ రశీ దు ఉండాలని స్పష్టం చేశారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లు రెవెన్యూ సిబ్బందితో కలిసి మొండి బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత బకాయి దారులకు రెడ్ నోటీసులు ఇవ్వొద్దని పలువురు వ్యాపారులు కమి షనర్‌ను కోరారు. రెవెన్యూ సిబ్బంది మధు, నర్స య్య, కృష్ణవాసు, బాబురావు పాల్గొన్నారు.
పన్ను బకాయిల వసూలు ముమ్మరం
రంగంలోకి కలెక్టర్ రిజ్వాన్ బాషా
రెడ్ నోటీసులు జారీ..
పట్టణంలో యాక్షన్ బృందాలు
చెల్లించకుంటే ఆస్తుల జప్తు కూడా..!
‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
వసూళ్లకు 30 టీంలు
వసూళ్లకు 30 టీంలు
Comments
Please login to add a commentAdd a comment