నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్‌

Published Fri, Feb 28 2025 1:50 AM | Last Updated on Fri, Feb 28 2025 1:47 AM

నీటి

నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్‌

జనగామ రూరల్‌: తాగు, సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీరు వృథా కాకుండా కాల్వ లను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టా లన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నీటి సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ సుధీర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఈఈ వినయ్‌బాబు, ప్రవీణ్‌, మంగీలాల్‌, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

రేపు వ్యవసాయ

మార్కెట్‌కు సెలవు

జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లోని శ్రీ రామాంజనేయ కమిషన్‌ వ్యాపారి కందుకూరి రామాంజనేయులు రెండు రోజుల క్రితం మృతి చెందగా.. మార్చి ఒకటో తేదీన మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు చైర్మన్‌ బనుక శివరాజ్‌యాదవ్‌ గురువారం తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాగా మృతుడి కుటుంబాన్ని చైర్మన్‌తోపాటు కార్యదర్శి నరేంద్ర, అడ్తి ప్రతినిధి మాశెట్టి వెంకన్న, ట్రేడర్లు, వ్యాపారులు, హమాలీ ప్రతినిధులు పరామర్శించారు.

ఔషధ కంపెనీపై

క్రిమినల్‌ కేసు నమోదు

జనగామ: పట్టణ పరిధి స్వర్ణ కళామందిర్‌ రోడ్డులోని పాండు మెడికల్‌ ఏజెన్సీలో అభ్యంతరకర ప్రకటనలతో ఉన్న డ్రగ్స్‌ను సీజ్‌ చేసి, సదరు కంపెనీపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు వరంగల్‌ ఔషధ నియంత్రణ సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి తెలిపారు. గురువారం జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలె బాలకృష్ణతో కలిసి ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇండోర్‌కు చెందిన ఓ కంపెనీ డ్రగ్స్‌పై నిబంధనలు ఉల్లంఘిస్తూ అభ్యంతరకర ప్రకటనలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సీజ్‌ చేసి జనగామ కోర్టుకు అప్పగించిన ట్లు పేర్కొన్నారు.

రిజర్వేషన్లు శాసీ్త్రయంగా కేటాయించాలి

జనగామ రూరల్‌: ఎస్సీ వర్గీకరణలో రిజర్వేష న్లను శాసీ్త్రయంగా కేటాయించాలని ఎమ్మార్పీ ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్‌ అన్నారు. జనగామ పట్టణంలో గురువారం జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్‌ ఆధ్వర్యాన నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌, అనుబంధ విభా గాల ఉద్యమ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ సమర్పించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని, వివిధ కులాలను గ్రూప్‌లలో చేర్చే అంశంలో, రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో నిర్ధిష్టమైన ప్రామాణిక సూత్రాలను పాటించలేదన్నారు. గ్రూప్‌–1లో ఉన్న మన్నె, పంబాల కులాలను గ్రూప్‌–3లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన మాదిగల త్యాగాలు వెలకట్టలేనివని, మార్చి 1న సంస్మరణ దినోత్సవాన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తాళ్లపల్లి కుమార్‌, రవీందర్‌, జెరిపోతుల సుధాకర్‌, బిర్రు నాగేష్‌, బొట్ల మహేష్‌, రవి, ఎల్లస్వామి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్‌
1
1/1

నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement