అగ్ని గుండాలు
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బచ్చన్నపేట : కొడవటూరు స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొ ని గురువారం ఉదయం అగ్ని గుండాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, ఈఓ చిందం వంశీ, ప్రధాన పూజారి ఓం నమఃశివాయ ఆధ్వర్యాన ఉదయం అర్చకులు భద్రకా ళి మాతకు శాంతి పూజల అనంతరం అగ్ని గుండం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన పూజారి ఓం నమఃశివా య తొలుత అగ్ని గుండ ప్రవేశం చేయగా శివ సత్తులు, భక్తులు అనుకరించారు. అగ్ని గుండాల వద్ద తోపులాట జరగకుండా నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే.హమద్ ఆధ్వర్యా న బందోబస్తు చేపట్టా రు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం అయిన గెలుపు ఆశీర్వాదంలో నూతనంగా వేద మంత్రాలు, విన్యాసాలు నేర్చుకున్నవారు తమ గురువు ల ముందు ప్రదర్శించారు. అలాగే ఉత్సవాల విజయవంతానికి సహకరించిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో అర్చకులు సదాశివుడు, మహాశివుడు, సంగమేశ్వర్, సిబ్బంది నూకల లక్ష్మీకాంత్‌రెడ్డి, గంగం భానుప్రకాష్ రెడ్డి, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment