రథోత్సవం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి డి.రవీంద్రశర్మ దంపతులు, ఏసీపీ అంబటి నర్స య్య, ఈఓ సల్వాది మోహన్‌బాబు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై వపన్ రథోత్సవాన్ని ప్రారంభించారు. కోలాట కళాకారుల ప్రదర్శన, భక్తి గీతాల ఆలాపనతో పురవీధుల గుండా సాగిన రథోత్సవానికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గుట్ట నుంచి గుడివాడ చౌరస్తా, గ్రామ పంచాయతీ, హనుమాన్ టెంపుల్, రాజీవ్ చౌర స్తా మీదుగా నిర్వహించిన రథోత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. అర్చకులు డీవీఆర్. శర్మ, అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జడ్జి దంపతులు స్వామివారికి అభిషే కం నిర్వహించారు. జాతరలో జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల, సేష్టన్‌ఘన్‌పూర్ విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలల ఎన్‌సీసీ విద్యార్థులు భక్తులకు సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment