వైభవంగా వసంతోత్సవం
పాలకుర్తి టౌన్: మహా శిరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వసంతోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతులు, లక్ష్మీనర్సింహస్వామిలను ఊయలలో ఆశీనులను చేసి డోలారోహణం చేపట్టారు. ఆలయ ఆవరణంలో ఊరేగింపు తర్వాత సదన్యం, పుష్పయాగం, పల్లకీ సేవ చేసి తరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి అనిల్‌కుమార్, నాగరాజు, సునిల్, సంతోష్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment