జనగామ రూరల్: బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని శుక్రవారం వడ్లకొండ రైతులు జనగామ–హుస్నాబాద్ రహదారి వడ్లకొండ రోడ్డుపై రాస్తారో కో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండిన వరితో నిరసన తెలిపారు. ఆరుగాలం కష్టపడి వరి సాగు చేస్తే పంట చేతికందే సమయానికి చెరువులు, కాల్వల్లో చుక్క నీరు లేదని వాపోయారు. ధర్నా విషయం తెలు సుకున్న సీఐ దామోదర్‌రెడ్డి చేరుకుని రైతులకు డీఈతో ఫోన్ మాట్లాడించారు. రెండు రోజుల్లో నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రైతులు హరీశ్, నామాల భాస్కర్, జగన్, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎండిన వరితో రైతన్నల నిరసన
Comments
Please login to add a commentAdd a comment