ముగిసిన కులగణన
● 1,77,191 కుటుంబాల్లో సర్వే పూర్తి
● ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి
● టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: జిల్లాలో ఈనెల 16న చేపట్టిన కులగణన(సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) రెండో విడత ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. మొదటి విడతలో గణన పూర్తి కాని కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన స్టేట్ కాల్‌సెంటర్‌కు 41, ప్రజాపాలన కేంద్రాల్లో 28 కుటుంబాల వారు తమ వివరాలను నమో దు చేసుకున్నారు. మొత్తం 1,77,191 కుటుంబాల గణన పూర్తయింది. జిల్లాలో రెండో విడత కుల గణ న సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా డాటా ఎంట్రీ ప్రక్రియపై సమీక్షించారు. ఎంపీడీఓ కార్యాలయం, ప్రజాపాలన సేవా కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసే క్రమంలో తప్పులు లేకుండా చూడాలని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎల్1, ఎల్2, ఎల్3 జాబితాకు సంబంధించి మార్పులు, చేర్పులకు తప్పనిసరిగా కారణాలు చూపించాలని పేర్కొన్నా రు. అనర్హులను జాబితాలో చేరిస్తే సదరు పంచాయ తీ కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవన్నారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ మాతృనాయక్ పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షలు, ఎల్‌ఆర్‌ఎస్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండరి చేతన్‌నితిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తి చేయాలని చెప్పారు. రేపటి నుంచి ప్రశ్నపత్రాలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి పోలీస్ స్టేషన్లకు బందోబస్తు మధ్య పంపించాలన్నారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్– 2020 కింద 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, 2024 సెప్టెంబర్‌లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని దరఖాస్తుల క్రమబద్ధీకరణ మాత్రమే జరిగిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని వివరించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీసీలో డీఐఈఓ జితేందర్‌రెడ్డి, ఆర్డీఓలు గోపీరాం, వెంక న్న, డీపీఓ స్వరూప, విద్యుత్ ఎస్‌ఈ వేణుమాధవ్, ఆరోగ్య శాఖ పీఓ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment