బాల సదనాన్ని సందర్శించిన జడ్జి విక్రమ్
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనాన్ని సీనియర్ సివిల్ జడ్జ్ సి.విక్రమ్ శుక్రవారం సందర్శించారు. బాలసదన్ హోమ్‌లో వసతులు ఎలా ఉన్నాయి.. ఏ విధమైన సమస్యలు ఉన్నాయని బాలికలను అడిగి తెలుసుకున్నారు. భోజన వసతులు, రక్షణ, భద్రత చర్యలను పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉంటే కాగితంపై రాసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని ఈ సందర్భంగా బాలికలకు సూచించారు. కార్యక్రమంలో బాలసదన్ సిబ్బంది స్రవంతి, నివేదిత తదితరులు పాల్గొన్నారు.
హస్తకళల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు
స్టేషన్‌ఘన్‌పూర్: గోల్కొండ హస్తకళా కార్పొరేష న్ సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బాబిన్ లేస్, క్రాస్ స్టిచ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని పంచకళా హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత జీడి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఘన్‌పూర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మా ట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో ఘన్‌పూర్‌కు చెందిన నీరటి మేరీ, చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన ఎడ్ల సుజాత ప్రతిభ కనబర్చారని, వారికి రాష్ట్ర వ్యవసాయ, టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా అవార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
బచ్చన్నపేట : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. శుక్రవారం కస్తూ ర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నా రు. విద్యార్థులకు వడ్డించే భోజనం, వసతుల గురించి ఆరా తీశారు. అలాగే వంటగది, సామగ్రి, పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, ఎస్‌ఓ గీతా, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాల సదనాన్ని సందర్శించిన జడ్జి విక్రమ్
బాల సదనాన్ని సందర్శించిన జడ్జి విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment