2022లో ‘ఉడాన్’కు ఎంపిక
మామునూరు ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ రంగాలు అభివృద్ధి చెందనున్నాయి. సమీప పర్యాటక ప్రాంతాలైన భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి సందర్శకులు పెరుగుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది. అలాగే, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులోని ‘కై టెక్స్’ మాదిరి గానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు ముందుకు వస్తే పెట్టుబడులు పెరిగి ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశముంది. వేలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి.
చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం 2016లో ఉడాన్ (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం తీసుకొచ్చింది. దీని కింద మామునూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసింది. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంలో ఎయిర్‌స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. దశాబ్దాలుగా వినియోగం లేకపోవడంతో అవి బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్‌స్ట్రిప్‌కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్ వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ జరగాలంటే ప్రజాప్రతినిధులతో పాటు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి.
2022లో ‘ఉడాన్’కు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment