ఆరు నెలలుగా అందని వేతనం
జనగామ : మూగ జీవాలకు ప్రాణం పోస్తూ ఆపద సమయంలో భరోసా కల్పిస్తున్న 1962 సంచార పశువైద్యశాల(అంబులెన్స్) సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారు. దీనికితోడు ప్రాజెక్టు ఎత్తి వేస్తారనే ప్రచారంతో వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో 1962 అంబులెన్స్‌లు మూడు ఉన్నాయి. ఒక్కో సంచార వైద్యశాలలో డాక్టర్, వైద్య సహాయకులు, పైలట్, హెల్పర్ మొత్తం నలుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా 300 నుంచి 400ల పశువులకు చికిత్స చేస్తున్నారు. రోజువారీగా 20 వరకు ఫోన్‌కాల్స్ వస్తాయి. ఇందులో ఒక్కటి లేదా రెండు పశువులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. నెలంతా కష్టపడితే వచ్చే వేతనంతో కుటుంబం గడిచే పరిస్థితి. ఆరు నెలలుగా వేతనం రాక ఉద్యోగులు అప్పులు చేస్తున్నారు. ఒక్క ఇంక్రిమెంట్ లేకుండా ఏడున్నరేళ్లుగా అంబులెన్స్‌పై పని చేస్తున్న తమపై ప్రభుత్వం కురణ చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వెటర్నరీ కార్యాలయం వద్ద నిరసన
పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సంచార పశువైద్యశాల ఉద్యోగులు, సిబ్బంది జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. డాక్టర్లు విజయ్‌కుమార్, శరత్, అపూర్వ సూర్య తేజ, సహాయకులు అఖిల్, సురేందర్, భాస్కర్, పైలట్లు గుంటుపల్లి రమేశ్‌బాబు, చిక్కుడు భరత్, హెల్ప్‌ర్లు నీలం లక్ష్మణ్, ధరావత్ సోములు తదితరులు అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఏడేళ్లుగా అడ్రస్ లేని ఇంక్రిమెంట్లు
దుర్భర జీవనం గడుపుతున్న
సంచార పశువైద్యశాల సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment