కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ తరహాలో..
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధ్యయనం చేసి అక్కడి మాదిరిగా ఇక్కడ వసతులు కల్పించేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అక్కడి ప్రత్యేకత ఏమిటనే చర్చ వచ్చింది. ‘కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ (సీఐఏఎల్) పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో నెడుంబస్సెరీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో నిర్మించారు. 1999 మే 25న అందుబాటులోకి వచ్చింది. ఏ ప్రాంతం నుంచైనా చేరుకునేలా 56 రేడియల్ రోడ్లను నిర్మించారు. సమీప పర్యాటక ప్రాంతాలైన పథనంతిట్ట, ఎర్నాకులం, కొట్టాయం, అలిప్పి నుంచి నేరుగా చేరుకులా ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారులను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో నిర్మించిన తొలి ఎయిర్‌పోర్ట్ ఇది. 32 దేశాలకు చెందిన 10 వేల మంది ఎన్‌ఆర్‌ఐలు ఈ విమానాశ్రయ నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రస్తుతం 31 అంతర్జాతీయ, 22 దేశీయ గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నా యి. పూర్తిగా సోలార్ విద్యుత్‌తో నడిచే విమానాశ్రయాల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. తొలుత దేశీయ విమానాల రాకకు టెర్మినల్స్‌ను నిర్మించారు. అనంతరం దశల వారీగా విస్తరణ చేశారు. ప్రస్తుతం మూడు టెర్మినళ్లు ఉన్నాయి. ఒకటి దేశీయ, రెండోది అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సేవలు అందిస్తోంది. మరో దానిలో కార్గో సేవలను నిర్వహిస్తున్నారు. 2023–24లో 1.08 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రయాణికుల రాకపోకల పరంగా దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉందని పౌర విమానాయన శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment