పైపు పగులగొట్టి.. నీటి తరలింపు
రఘునాథపల్లి: స్టేషన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్‌కు వెళ్లే కెనాల్‌లో లెవల్ పైపు పగులగొట్టడంతో కంచనపల్లి పైపు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో కంచనపల్లిలో సాగు చేసిన వరి, ఇతర పంటలకు నీరు అందక ఎండుతున్నాయి. బోయినిగూడెం వద్ద పాలకుర్తి వైపు వెళ్లే కాల్వకు సాగునీరు వెళ్లేందుకు షెట్టర్ లేక పోవడంతో అధికారులు తాత్కాలికంగా లెవల్‌పైపు ఏర్పా టు చేశారు. కెనాల్‌కు సాగు నీరు అంతంత మాత్రంగానే వస్తుండటంతో గుర్తుతెలియని వ్యక్తులు లెవల్‌పైపు పగులగొట్టి పాలకుర్తి వైపు నీరు వెళ్లేలా చేశా రు. అధికారులు స్పందించి కంచనపల్లి వైపు నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ వినయ్‌బాబు ను వివరణ కోరగా లెవల్ పైపు పగులగొట్టిన సమాచారం లేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కంచనపల్లి వైపు ఎండుతున్న పంటలు
Comments
Please login to add a commentAdd a comment