జల గండం
జనగామ: డేంజర్ జోన్‌లో భూగర్భ జలాలు.. ఏడు వందల ఫీట్ల లోతుకు బోరు వేసినా కానరాని గంగమ్మ.. భూమిని పీల్చి పిప్పి చేస్తున్నా... పావు ఎకరం తడవని దయనీయ పరిస్థితి నడుమ జిల్లా యాసంగి సీజన్‌లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్‌కు ముందుగానే రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని చెరువులు, కుంటలకు తరలించడంలో జాప్యం చేయడంతో మూడు దశాబ్ధాల క్రితం చూసిన కరువు మళ్లీ కనిపిస్తోంది. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 37 ఫీజో మీటర్లు ఉండగా, 11 ప్రాంతాల్లో 9.16 మీటర్ల లోతు నుంచి 16.25 మీటర్ల తోలుకు భూగర్భజలాలు పడిపోయాయంటే ఎంతటి కరువు ఛాయలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగయ్యాయి. జిల్లాలో 575 చెరువుల్లో 25 శాతం నీరు లేని పరిస్థితి నెలకొంది. 50శాతం లోపు 149, 75 శాతం లోపు 45 చెరువుల్లో నీరు ఉండగా, సుమారు వందకు పైగా చెరువులు, కుంటలు నెర్రలు బారిపోతున్నాయి.
8.01 మీటర్ల లోతులో..
జిల్లాలో 10 నుంచి 16 మీటర్ల లోతుకు భూగర్భ జ లాలు పడిపోయాయి. ఒక రకంగా జిల్లా డేంజర్ జోన్‌లో పడిపోయినట్టే. 10 మీటర్ల లోతు వరకు పడిపోతే భూగర్భ జలాల వనరుల శాఖ హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. గత నెల జనవరి మాసంలో జిల్లాలో యావరేజ్‌గా 7.26 మీటర్ల లో తులో ఉన్న జలాలు.. ఫిబ్రవరి మాసం వచ్చే సరికి 8.01కి జారి పోయాయి. బచ్చన్నపేట ఫీజో మీటర్ పరిధిలో 9.16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, పడమటి కేశ్వాపూర్, పోచన్నపేటలో 8.13–8.15 మీటర్ల లోతుకు జారిపోయాయి. ఘన్‌పూర్ మండలం ఛాగల్‌లో 11.57, జనగామ సిద్ధెంకి ఏరియాలో 15.66, కొడకండ్ల ఏరియాలో 10.21, రఘునాథపల్లి మేకలగట్టులో 16.25, పాలకుర్తి హెడ్ క్వాటర్ ప్రాంతంలో 9.91, వల్మిడిలో 10.52, రఘునాథపల్లి మండలంలో 10.5, తరిగొప్పుల హెడ్ క్వాటర్‌లో 9.2, అక్కరాజుపల్లిలో 12.18, జ ఫర్‌గఢ్ కూనూరు ఏరియాలో 14.75 మీటర్లలో తుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
ప్రమాద స్థాయికి చేరిన భూగర్భజలాలు
11 ప్రాంతాల్లో 9.16 నుంచి
16.25 మీటర్ల లోతుకు
ఎండుతున్న పంటలు...
నెర్రలు బారుతున్న నేలలు
గోదావరి జలాల తరలింపులో జాప్యం
రోడ్డెక్కుతున్న అన్నదాతలు
కష్టాల బాటలో యాసంగి సీజన్
జిల్లాలో 1.72లక్షల ఎకరాల్లో
పంటల సాగు
కౌలుకు తీసుకున్నా..
4 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేసిన. అప్పులు తెచ్చి రూ.1.50 ల క్షల పెట్టుబడి పెట్టిన. ఒక్కసారిగా భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు అడుగంటాయి. మొదటి మడికి సైతం సాగునీరు అందలేదు. దీంతో ఉన్న పంట మొత్తంగా ఎండిపోయింది.
– మానేపెల్లి లక్ష్మణ్,
రైతు, లక్ష్మాపూర్, బచ్చన్నపేట
బోర్లు ఆగుతూ పోస్తున్నాయి..
యాసంగి సీజన్‌కు ముందు సాగునీరు బాగానే ఉండ టంతో 4 ఎకరాల్లో వరి సాగు చేసిన. రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. పంట పొట్టదశకు చేరుకునే సమయంలో రెండు బోర్లు ఆగుతూ పోస్తుండడంతో ఒక వైపు తడి కాగా.. మరో వైపు ఎండిపోతుంది.
– బండారి రాములు, రైతు, బచ్చన్నపేట
జల గండం
జల గండం
జల గండం
జల గండం
Comments
Please login to add a commentAdd a comment