మద్యం తాగి వాహనం నడపొద్దు
● డీసీపీ రాజమహేంద్రనాయక్
జనగామ: మద్యం తాగి వాహనం నడపొద్దని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తాలో ఎస్సైలు రాజన్‌బాబు, భరత్, చెన్నకేశవులుతో కలిసి శనివారం రాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేప ట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. వెస్ట్‌జోన్ పరిధిలో నిరంతరాయంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. వాహనదారులకు అన్ని పత్రాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఉన్నారు.
నీటి ఎద్దడి లేకుండా చూడాలి
నర్మెట: మండల కేంద్రంలో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా నీటి ఎద్దడి లేకుండా చూడాలని డీపీఓ నాగపురి స్వరూపరాణి అన్నారు. శనివారం జీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడుతూ వాటర్ ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. వందశాతం పన్నులు వసూలు చేసి ట్రెజరీలో జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరవింద్‌చౌదరి, పంచాయతీ కార్యదర్శి కందకట్ల శ్రీధర్, కారోబార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన హెచ్.హర్షిణి, సీహెచ్ అక్షయ, పి.వర్షజి, స్వాతిక, భవాని, బి.ఇందు అనే విద్యార్థినులు షూటింగ్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఎన్. వరలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఎన్.అనిత తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కూడా మరింత ప్రతిభ కనబర్చాలని కోరారు. ఈ మేరకు విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తెలిపారు.
కళ్లెం సొసైటీలో విచారణ
లింగాలఘణపురం: మండలంలోని కళ్లెం పీఏసీఎస్‌లో శనివారం సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టార్ కోర్నేలియస్ విచారణ చేపట్టారు. నెలరోజుల క్రితం సొసైటీలోని 11 మంది డైరెక్టర్లు ధాన్యం కొనుగోలు వివరాలు, ఏడాదిగా సమావేశం నిర్వహించకపోవడం, సొసైటీ లాభనష్టాలు, రైతుల రుణమాఫీ వివరాలను సభ్యులకు సమాచారం ఇవ్వడం లేదని డీసీఓ, జాయింట్ కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ దీంతో శనివారం అసిస్టెంట్ రిజిస్టార్ విచారణ చేపట్టారు. డైరెక్టర్లతో పాటు రైతులు కూడా హాజరు కాగా సొసైటీకి సంబంధించి మినిట్స్ బుక్, ఇతర రిజిస్టర్లు ఇవ్వాలని సీఈఓ మల్లేశంను కోరగా రికార్డులన్నీ తన వద్ద లేదని, చైర్మన్ ఇంట్లో ఉన్నాయని చెప్పడంతో ఎలాంటి విచారణ చేపట్టకుండానే వెళ్లిపోయారు. ఈ నివేదికనే అందజేస్తామని వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ విజయ్‌భాస్కర్, డైరెక్టర్లు ఏలె నర్సింహ్ములు అలియాస్ మూర్తి, మబ్బు రమేష్, బండ కుమార్, చాపల మల్లయ్య, నర్ర ప్రతాప్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
మద్యం తాగి వాహనం నడపొద్దు
మద్యం తాగి వాహనం నడపొద్దు
Comments
Please login to add a commentAdd a comment