పంచ సూత్రాలతో ‘విజయోస్తు’
జనగామ రూరల్: టెన్త్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం విజయోస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విధితమే. ఇందులో భాగంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా పంచ సూత్రాలతో విజయోస్తు లేఖను తానే స్వయంగా లిఖించి విద్యార్థులకు అందజేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచలోని జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించి టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇష్టంతో కష్టపడి చదివితే విజయం సాధించవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ స్వయంగా లిఖించిన (ప్రణాళికాబద్ధంగా చదవడం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, గత ప్రశ్న పత్రాలను సాధన చేయడం, మానసిక ఒత్తిడిని అధిగమించడం, మంచి ప్రతిభా నైపుణ్యాలను అలవర్చుకోవడం) పంచ సూత్రాల లేఖను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ టి. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇంటర్ పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి చీఫ్ సూపరింటెండెంట్, అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,251 మంది, రెండో సంవత్సరంలో 4,694 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ గూగుల్ మీట్ డీఐఈఓ జితేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
టెన్త్ విద్యార్థులకు అందించిన
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment