ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని తెలంగాణ గృహనిర్మాణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతమ్ గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, అధికారులతో సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులతో మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ వీసీలో హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈలు భజరంగ్ లాల్, సాయిరాం రెడ్డి, ఎంపీడీఓ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించని డీఈఓపై చర్య తీసుకోవాలి
జనగామ రూరల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించని జిల్లా విద్యాశాఖాధికారిపై చర్య తీసుకోవాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం డీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెడ్పీఎస్‌ఎస్ వెంకిర్యాల హెచ్‌ఎం రిటైర్డ్ అయి ఐదు నెలలు గడుస్తున్నా.. పెన్షన్ ప్రతిపాదనలు పంపించకుండా మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. అనంతరం పలు సమస్యలతో కూడి వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు షరీఫ్, యాదయ్య, చొక్కయ్య, దూడయ్య, శ్రీనివాసచారి, నాగేందర్, ఆంజనేయులు, శివరాం, శ్రీనివాసులు, అరుణో దయ కుమారి, రాములు, శంకరయ్య, కమలాకర్ రెడ్డి, శ్రీనివాస్, సూర్య ప్రకాష్, సురేష్ బాబు, నా గార్జున రావు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment