వైభవంగా అగ్నిగుండాలు
పాలకుర్తి టౌన్: ప్రముఖ శైవక్షేత్రం పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర బ్రహ్మాత్సవాలు శనివారం అగ్నిగుండాలు, మహాఅన్నపూజ, పూర్ణహుతితో ముగింది. చివరి రోజు ఆలయంలోని మెట్ల ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు నేతృత్వంలో తెల్లవారుజామున 4.30 గంటలకు స్వామివార్లను పల్లకిలో వాహనకారులు, భక్తులు నిప్పులపై నడిచి భక్తిపారవశ్యానికిలోనయ్యారు. భక్తులు పెద్ద ఎత్తున శివనామస్మరణ చేస్తూ అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం జరిగిన పూర్ణహుతి, స్వామివారికి 21 కేజీల పెరుగన్నంతో మహాఅన్నపూజ నిర్వహించారు. అగ్నిగుండం వద్ద ఎలాంటి సంఘటలను జరగకుండా సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు పవన్‌కుమార్, లింగారెడ్డి, యాకుబ్ హైస్సేన్‌లు బందోబస్తు నిర్వహించారు. అయితే అగ్నిగుండాల కార్యక్రమం ముగిసిన తర్వాత పాలకుర్తికి చెందిన చిలుకమారి స్వరూప, గిగ్గిల్ల మంజుల అగ్నిగుండం నుంచి నడిచి వెళ్తుండగా అదుపుతప్పి కింపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగంజం నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయంలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment