అగ్నిమాపక యంత్రాలపై అవగాహన
జనగామ రూరల్: అగ్నిమాపక యంత్రాలపై సిబ్బంది అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో అగ్నిమాపక యంత్రాల వినియోగంపై కలెక్టర్ కార్యాలయం సిబ్బందికి శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందాలని, వాటి పనితీరును తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు ఏ.కె.మన్సూరి, సిబ్బంది పాల్గొన్నారు.
5న మెగా జాబ్‌మేళా
జనగామ రూరల్:పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. నర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్‌లో ప్లేస్‌మెంట్ సెల్, మ్యాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు మెగా జాబ్‌మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన, చదువుచున్న విద్యార్థులు కూడా పాల్గొనవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment