సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
నల్లా బిల్లులు చెల్లించినా.. ఆన్‌లైన్‌లో బకాయి చూపిస్తున్న వైనం
రోజువారీగా వసూలు చేసిన డబ్బులు ఏవీ? ● ఆందోళనలో వినియోగదారులు
జనగామ: జనగామ మున్సిపల్ పరిపాలన గాడి తప్పింది. కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ (సీడీఎం) ఆదేశాలు కూడా పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంటే... ఇక్కడ మాత్రం ఆఫ్‌లైన్ అంటున్నారు. నల్లా బిల్లులు చెల్లిస్తున్నా... ఆన్‌లైన్‌లో బకాయి చూపిస్తుండడంతో పట్టణ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పారదర్శకత లేని ఆఫ్‌లైన్ విధానంతో నల్లా బిల్లుల వసూళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే.. అధికారులు మాత్రం ఆవేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జనగామ పట్టణంలోని 30 వార్డుల పరిధిలో 13,636 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ట్యాప్ కలెక్షన్ల ద్వారా ఏటా రూ.1.66 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.19 లక్షల మేర వసూళ్లు చేశారు. ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపుకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం ఆఫ్‌లైన్ ద్వారా రశీదు ఇస్తూ పన్ను తీసుకుంటున్నారు. గతంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డుల మాయం, డబుల్ బిల్లులు, నాసిరకం పనులకు చెల్లింపులు ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత మూడేళ్ల కాలం నాటి ఆడిట్ పూర్తి చేసి రెండేళ్లు గడిచి పోతున్నా, అందులో వెలుగు చూసిన అక్రమాలను బయట పెట్టడం లేదు. ఆన్‌లైన్ పద్ధతిలో చేసిన పనులకే దిక్కులేని పరిస్థితిలో ఆఫ్‌లైన్‌లో నల్లా బిల్లులు వసూళ్లు చేస్తే పారదర్శకత ఎక్కడా అంటూ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
ఆన్‌లైన్ చేస్తున్నాం..
నల్లా పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రస్తుతం ఆఫ్‌లైన్ పద్ధతిలో వ సూళ్లు చేస్తుండగా, త్వరలోనే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేస్తాం. ఆఫ్‌లైన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. బకాయిలు చెల్లించిన వారు ఆనన్‌లైన్‌లో డ్యూ చూపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదు. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్
వార్డులు:
30
నల్లా కనెక్షన్లు: 13,636
నల్లా పన్ను చెల్లించేందుకు ఐదు రూపాయల బిళ్లలు తీసుకొచ్చిన వినియోగదారుడు వేణు
రావాల్సిన బకాయి : రూ.1.66
కోట్లు
ఇప్పటి వరకు వసూలైంది : రూ.19 లక్షలు
న్యూస్‌రీల్
పన్ను చెల్లించినా..
వినియోగదారులు ఆఫ్‌లైన్ ద్వారా నల్లా పన్ను చెల్లించినా ఆన్‌లైన్‌లో బకాయి ఉండడంతో అధికా రులను నిలదీస్తున్నారు. రశీదులు తీసుకువస్తే... ఆన్‌లైన్‌లో బకాయి నుంచి చెల్లించినట్టుగా మారుస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ఒకవేళ నల్లా పన్నుకు సంబంధించిన రశీదు పోగొట్టుకుంటే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నా.. పురపాలిక నుంచి ఎటువంటి జవాబు రావడంలేదు. రోజువారీగా నల్లా పన్నులు వసూ ళ్లు... బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఎంత.. అనే లెక్కలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆస్తిపన్ను, ఇంటి అనుమతులు ఇలా ప్రతీ పని ఆన్‌లైన్ ద్వారా కొనసాగుతుంటే.. ఒక్క నల్లా పన్నులు మాత్రం ఆఫ్‌లైన్‌లో ఎందుకు తీసుకుంటున్నారేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. గ్రెయిన్ మార్కెట్ కు చెందిన పి.వేణు గతంలో నల్లా పన్ను రూ.6వేలు చెల్లించగా, ఇంకా రూ.3,600 బకాయి ఉన్నాడు. కా నీ ఆన్‌లైన్‌లో రూ.9,600 బకాయి ఉన్నట్లు చూపించడంతో ఆయన మున్సిపల్‌కు వెళ్లి సంబంధిత అఽ దికారులను ప్రశ్నించారు. సరి చేస్తామంటూ తప్పించు కునే ప్రయత్నం చేశారు. బకాయి ఉన్న రూ. 3,600 ఐదు, పది రూపాయల బిళ్ల్లలు ఇవ్వగా, అ ధికారులు ససేమిరా అన్నారు. కాయిన్స్ తీసుకో వడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో వాటిని తీసుకుని రశీదు ఇ చ్చా రు. ఆఫ్‌లైన్ రశీదులు పోగొట్టుకుని, ఆన్‌లైన్‌లో వందశాతం నల్లా పన్ను ఉందని చూపించే బాధితులు చాలా మంది ఉన్నారని, వారికి ఏం సమాధానం చెబుతారని గట్టిగా ప్రశ్నించడంతో అలాంటిది ఏమీ ఉండదని దాటవేసే ప్రయత్నం చేశారు.
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment