రంజాన్ ఉపవాస దీక్షలు షురూ
జనగామ: పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై జాతీయత, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయి. క్రమశిక్షణ, దాతృత్వం, థార్మిక చింతన కలయికే రంజాన్ మాసంగా చెప్పుకుంటారు. ఖురాన్ అవతరించిన పవిత్రమైన నెలగా భావించి, ముస్లింలు ఉదయం ఉపవాస దీక్షలతో మజీద్‌లో ప్రార్థనలు చేసి, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆహారం తీసుకుంటారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో పండుగ వాతా వరణం నెలకొంది. పట్టణంలో అనేక చోట్ల హలీం సెంటర్లను ఏర్పాటు చేయగా, రాత్రి రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాలన్నీ రద్దీగా మారిపోతున్నాయి.
ప్రార్థనలు ఇలా..
పవిత్ర రంజాన్ మాసంలో మజీదులో ఇమామ్, మౌజన్ల ఆధ్వర్యంలో రోజుకు ఐదు సార్లు, శుక్రవారం జరిగే ప్రత్యేక ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఇందులో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను స్మరిస్తూ భక్తిని చాటుకుంటారు. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో ఆచరించాల్సిన నియమం ‘ఉపవాస వ్రతం’. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘రోజా’ అంటారు. రంజాన్ మాసంలో మరో విశేషం దానధర్మాలు చేయడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుంది. రంజాన్ మాసంలో ‘జకాత్’ ఆచరించాలని ఖురాన్ బోధిస్తుంది. తాము సంపాదించిన ఆస్తిలో కొంతభాగం పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. పేద ముస్లింలు అందరితో కలిసి పండుగ జరుపుకోవడానికి జకాత్ ఉపయోగపడుతుంది. జకాత్‌తో పాటు ‘ఫిత్రా’ దానం రంజాన్ నెలలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. రంజాన్ నెల అంతా పవిత్రమైన కార్యక్రమాలతో ముగుస్తూనే.. షవ్వాల్ నెల వంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే, ముస్లింలు ఉప వాస వ్రతాన్ని విరమించి, మరుసటి రోజు రంజాన్ పండుగను జరుపుకుంటారు. షవ్యాల్ నెల మొదటి రోజున జరుపుకునే పండుగను ఈదుల్ ఫితర్ అంటారు.
మజీదుల ద్వారా ఆజాన్, ఉపవాస దీక్షల సైరన్
భక్తిని చాటుతున్న ముస్లింలు
పండ్లు, డ్రైఫూట్స్‌కు పెరుగుతున్న గిరాకీ
Comments
Please login to add a commentAdd a comment