పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
● కంపుకొడుతున్న కాలనీలు
● కమిషనర్ ఉన్నారా.. ప్రజల అనుమానాలు
● అధ్వానంగా మారిన ప్రత్యేక పాలన
● పర్యవేక్షణ కరువు
జనగామ:
కంపుకొడుతున్న కాలనీలు.. రోడ్లపైనే చెత్త డంపింగ్‌లు... మురికి నీటితో నిండిన డ్రెయినేజీ లు.. దోమల స్వైర విహారం... ప్రమాదకరంగా నా లాలు... ఇది జనగామ మున్సిపల్ పరిస్థితి. కమిషనర్ ఉన్నాడా లేడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు వార్డు ప్రజలు. జనవరి 27వ తేదీన మున్సి పల్ పాలకమండలి పదవీ కాలం ముగిసిన తర్వా త ప్రత్యేక పాలన కొనసాగుతుంది. గాడితప్పిన పరిపాలన, అధ్వానంగా మారిన శానిటేషన్ నిర్వహణపై ‘సాక్షి’ మంగళవారం వార్డుల వారీగా చేపట్టిన విజిట్‌లో పలు విషయాలు వెలుగుచూశాయి.
జనగామ పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. సిద్ధిపేట, హనుమకొండ, సూర్యాపేట, హైదరా బాద్ ప్రధాన రహదారులకు జంక్షన్‌గా...19.31 స్వ్కేర్ కిలో మీటర్ల పరిధిలో జనగామ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 57 వేల మంది ఉండగా, ప్రస్తుతం 85వేలకు పెరిగినట్టు అంచనా. రోజువారీగా 12 టన్నుల చెత్త సేకరిస్తుండగా, చెత్త సేకరణకు 7 ట్రాక్టర్లు, 10 ఆటోల ద్వారా కార్మికులు పని చేస్తున్నారు. శానిటేషన్‌పై స్పెషల్ ఆ ఫీసర్ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
Comments
Please login to add a commentAdd a comment