విజయోస్తు!
జనగామ రూరల్: ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 17 కేంద్రాలు కేటాయించగా 9 సెంటర్లు జనగామ, 8 కేంద్రాలు ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉండగా ఉదయం 8.30 వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌తో పాటు లఘు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారని ఫి ర్యాదు మేరకు ఈ సారి వాయిస్ రికార్డుతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8,945 మంది విద్యార్థులు హాజరు కానుండగా మొదటి సంవత్సరం 4,251 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,694 మంది ఉన్నారు.
పరీక్ష కేంద్రాలు ఇవే..
పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, కోడ్యుకేషన్ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల, ఆర్‌ఆర్‌ఎం డిగ్రీ కళాశాల, ఏబీవీ జూనియర్ కళాశాల, ఏ,బీ, ప్రెస్టెన్ జూనియర్ కళాశాల, స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల, మోడల్ స్కూల్, నర్మెట, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్‌గఢ్, పాలకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలులో ఉంటుంది.
ఐదు నిమిషాలు ఆలస్యం అయినా..
గతంలో ఇంటర్ పరీక్షలకు నిమిషం నిబంధన ఉండేది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు ఈ నిబంధనను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ఉంటే మరో 5 నిమిషాలు సడలింపు ఇచ్చారు. ఆ తర్వాత వస్తే అనుమతించరు. విద్యార్థులు అర గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
హాజరుకానున్న
8,945 మందివిద్యార్థులు
నిమిషం నిబంధన ఎత్తివేత
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి
ప్రముఖ సైకాలజిస్ట్ వాసునాయక్
ప్రశాంత వాతావరణంలో రాయాలి
– వాసునాయక్, ప్రముఖ సైకాలజిస్ట్
ఇంటర్ విద్యార్థులు పరీక్షలను ఒత్తిడితో కాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలి. నేటి నుంచి వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి.
పరీక్షలకు ముందు చదివిన దాన్ని రివిజన్ చేయాలి. కొత్త సిలబస్‌ని చదవకూడదు.
పరీక్షల సమయంలో చదివే ముందు ఇష్టం ఉన్న సబ్జెక్ట్‌తో ప్రారంభించాలి.
పరీక్షల సమయంలో బయటి ఆహారం తీసుకోకుండా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
పరీక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత 15 నిమిషాల ముందు ఎవరితో మాట్లాడ కూడదు.
పరీక్ష పేపర్ తీసుకున్న తర్వాత నవ్వుతూ చదవడం ప్రారంభించాలి. అలాగే రాసే ముందు డీప్ బ్రీత్ తీసుకోవాలి.
పేపర్ చదివిన తర్వాత బాగా నచ్చిన, వచ్చిన సమాధానం రాయాలి.
నీరు ఎక్కువగా తీసుకోవాలి. అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. భయపడకుండా ఉల్లాసంగా పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం పొందుతారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా జరగనున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. సెంటర్ వద్ద తాగునీరు, టెంట్, మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేశాం. అందరి సహకారంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం.
జితేందర్‌రెడ్డి, ఇంటర్ విద్యాధికారి
విజయోస్తు!
విజయోస్తు!
విజయోస్తు!
Comments
Please login to add a commentAdd a comment