గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
చిల్పూరు : తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన చిల్పూరు శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటి(గురువా రం) నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, అర్చకులు రవీందర్‌శర్మ పేర్కొన్నారు. గురువా రం ఉదయం 6 గంటల కు అధ్యయనోత్సవం(తొళక్కము)తో మొదల య్యే ఉత్సవాలు.. 11వ తేదీన ఎదుర్కోళ్లు, 12వ తేదీన స్వామివారి కల్యాణం, 13వ తేదీన స్వామివారి రథోత్సవం, 14న చక్రస్నానంతో వేడుకలు ముగియనున్నాయి.
చిల్పూరుగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాల కు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇలా చేరుకోవ చ్చు. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో చిన్నపెండ్యాల స్టేజీ వద్ద ఆర్చి నుంచి రావాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి 30, కాజీపేట నుంచి 20, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 10, చిన్నపెండ్యాల ఆర్చిగేటు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం ఉంది. హన్మకొండ నుంచి తరిగొప్పులకు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు పలు ప్రైవేట్ వాహనా లు నిత్యం అందుబాటులో ఉంటాయి. భక్తులు గుట్టవద్ద బస చేయాలనుకుంటే ఆలయానికి సంబంధించిన సత్రాలే కాకుండా ప్రైవేట్ గదులు అందుబాటులో ఉంటాయి.
కనుల పండువగా వేడుకలు
నేటి నుంచి ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను ధర్మకర్తలు, దాతలు, ఆలయ కమిటీ, భక్తులతో కలిసి కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందాలి.
– పొట్లపల్లి శ్రీధర్‌రావు, ఆలయ చైర్మన్
భక్తులకు సౌకర్యాలు
భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ కమిటీ, దాతలు, దేవాదాయ శాఖ ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– లక్ష్మీప్రసన్న, ఆలయ ఈఓ
●
న్యూస్‌రీల్
చిల్పూరుగుట్టకు
ఇలా చేరుకోవచ్చు..
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment