నిబంధనల మేరకే ఫీజు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించిన రాయితీతో కూడిన ఎల్‌ఆర్‌ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో నిబంధనల మేరకే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నిషేధిత జాబితా లో లేని, సర్వే నంబర్లకు సంబంధించిన ప్లాట్లను క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు చేసుకున్న దరఖాస్తులను ఏదైనా కారణం చేత తిరస్కరిస్తే.. పునఃపరిశీలనకు అవకా శం ఉంటుందన్నారు. ఫీజులో 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని, చివరి గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందు కు గురువారం(నేడు) ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, 9948187334 నంబర్‌తో పాటు జనగామ పురపాలక సహాయ కేంద్రం 8978207205 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
విక్రయ దస్తావేజులతో క్రమబద్ధీకరణ
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో వేగం పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. కటాఫ్ తేదీ(2020 ఆగస్టు 26) నాటికి లే అవుట్ పరిధిలో పదిశాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మిగతా ప్లాట్లకు విక్రయదస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయించి మిగతా డబ్బులు తిరిగి ఇస్తారని వివరించారు.
విద్యార్థులకు రెండు జతల దుస్తులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా చెప్పారు. బుధవా రం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యాన అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి ఆయా శాఖల అధికారులు, ఏపీఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల అనంతరం విద్యా సంస్థలు పునః ప్రారంభమయ్యేలోపు ఒక్కో విద్యార్థికి రెండు జత ల దుస్తులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సిద్ధం చేసి స్కూళ్ల పునఃప్రారంభం రోజే అందజేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఎస్సీ, బీసీ సంక్షేమ అధికారులు విక్రమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం సందర్శించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాలు, అగ్నిమాపక చర్యలను పరిశీలించారు. వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల నిర్వహణ లో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.భాస్కర్, విజయభాస్కర్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు 25 శాతం రాయితీ
ఈనెల 31వ తేదీ వరకు గడువు
నేడు జనగామ మున్సిపాలిటీలో అవగాహన సదస్సు
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
జనగామ రూరల్: పరీక్షల సమయం సమీస్తున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం మండల విద్యాధికారులు, హెచ్‌ఎంలు, వివిధ సంస్థ ల యాజమాన్యాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్జెక్ట్‌ల వారీగా వెనుక బడిన విద్యార్థుల జాబితా సిద్ధం చేసి ఉత్తీర్ణత సాధించేందుకు చేపట్టవలసిన అంశాలపై వివరించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పూర్తిచేసిన పనులకు నిధులు చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో డీఈఓ రమేశ్, అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, ప్లానింగ్ సెక్టోరల్ అధికారి తోట రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment