వెబ్‌సైట్‌లో దరఖాస్తు..
వైకల్యం ఉన్న వ్యక్తులు యూడీఐడీ(పాత సదరం) కోసం ఇక నుంచి www.swavlambancard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ వెబ్‌సైట్ నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ), డాటా ఆపరేటర్ లాగిన్‌కు వెళ్తుంది. అందులో కేటగిరీల వారీగా ఉన్న జాబితాను వేరు చేసి క్యాంపులో వైద్యపరీక్షల కోసం స్లాట్స్ విడుదల చేస్తారు. 21 రకాల వైకల్యాలకు సంబంధించిన వారు ఎవరు ఎప్పుడు రావాలనే దానిపై తేదీలను ప్రకటిస్తారు. ఇందులో పార్ట్ ఏ, బీ రెండు రకాల పరిశీలన ఉంటుంది. పార్ట్ ఏలో లబ్ధిదారుడి వ్యక్తిగత సమాచారం, పార్ట్ బీలో వైకల్యం వివరాలను క్యాంపులో డాక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. ఆయా విభాగాల్లోని స్పెషలిస్టు డాక్టర్ పరిశీలించిన తర్వాత వైకల్యం పర్సంటేజీని డాక్టర్ మెడికల్ బోర్డు, సీఎంఓ లాగిన్‌లో అప్‌లోడ్ చేస్తారు. అప్పుడు యూడీఐడీ పోర్టల్‌కు వెళ్తుంది. ఇందులో వైకల్యం పర్సంటేజీ వారీగా అందరికీ కార్డు జారీ చేస్తారు. ఆన్‌లైన్ లాగిన్ సమయంలో పేర్కొన్న అడ్రస్‌కు పోస్టు ద్వారా యూడీఐడీ కార్డు నేరుగా ఇంటికి పంపిస్తారు. జిల్లాలో ప్రస్తుతం 10,366 మంది దివ్యాంగులు పింఛన్ పొందుతుండగా, మరో వెయ్యి మందికిపైగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment