16న స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించనున్నారు.. రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో బుధవారం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ముఖ్యమంత్రి ఘన్‌పూర్ మున్సిపాలిటీతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్‌కు మంజూరైన వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ కాంప్లెక్స్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, డిగ్రీ కళాశాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి నవాబుపేట కెనా ల్‌కు సీసీ లైనింగ్, పీఆర్ రోడ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్‌లు, డీఈ ఆఫీస్, బంజారా భవన్ తదితర పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు.. పనిలేని, పసలేని వారితో తన సమయం వృథా చేసుకోను.. అభివృద్ధే తన ధ్యేయమని కడియం అన్నారు. 50వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్నగుప్తా, కొలిపాక సతీష్, దుంపల పద్మారెడ్డి, నీరటి ప్రభాకర్, మంతెన ఇంద్రారెడ్డి, బూర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment