నిధుల దుర్వినియోగంపై విచారణ
స్టేషన్‌ఘన్‌పూర్: శివునిపల్లి మేజర్ గ్రామపంచాయ తీ కార్యదర్శిగా 2023 ఏప్రిల్ 1 నుంచి 2025 ఫిబ్రవరి 6 వరకు పనిచేసిన శ్రీకాంత్‌పై డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవా రం విచారణ చేపట్టారు. జీపీ నిధులు రూ.30లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు జీపీ మాజీ కార్యదర్శి చిరంజీవి భార్య ఉమారాణి ఫిర్యాదు మేరకు జీపీ ప్రత్యేక అధికారి పాపయ్య, ఎంపీఓ నర్సింగరావు సమక్షంలో ఫిర్యాదుదారుతోపాటు కార్యదర్శి శ్రీకాంత్‌ను విచారించారు. జీపీ ఆదాయ, వ్యయాల వివరాలను పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు రావడంతో ఫిర్యాదుదారులు మాత్రమే రావాలని అధికారులు పేర్కొనగా.. ఉమారాణితో ఏసీబీకి పట్టుబడిన ఆమె భర్త శివునిపల్లి మాజీ కార్యదర్శి చిరంజీవి ఎలా వచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు విచారణలో చెప్పాల్సిన అంశాలను లిఖితపూర్వకంగా డీఎల్‌పీఓకు అందజేసి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా శివునిపల్లి జీపీ కార్యదర్శి గా 2022 జనవరి 12 నుంచి 2023 మార్చి 2 వరకు పనిచేసిన కుర్ర చిరంజీవి అవినీతిపై విచారణ చేపట్టాలని బూర్ల శంకర్, చిగురు విజయ్, గుర్రం దేవ య్య, గుర్రం రాజు, ఎం.కిషోర్‌కుమార్ తదితరులు డీఎల్‌పీఓకు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment