ఇంకా నిక్కరేనా..!
జనగామ: నిక్కర్ వేసుకునే స్టేజ్ దాటిపోయింది.. ప్యాంట్ కావాలి.. ప్రభుత్వం పునరాలోచించాలి అంటూ సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులు విన్నవించుకుంటున్నారు. ఈ మేరకు నిక్కర్‌కు బదులు ప్యాంట్ స్టిచ్చింగ్ కోసం క్లాత్ పంపించాలని ఎంఈ ఓలు డీఈఓలకు అర్జీ పెట్టుకుంటున్నారు. సర్కారు స్కూళ్ల విద్యార్థులకు డ్రెస్‌కోడ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా రెండు జతల దుస్తులను అంది స్తోంది. ఈసారి డిజైన్‌లో పలు మార్పులు తీసుకువచ్చి.. స్టిచ్చింగ్‌ను సరళీకృతం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కు 2025–26 నూతన విద్యా సంవత్సరంలో ఉచి తంగా పంపిణీ చేసే యూనిఫాంలో పలు మార్పులు తీసుకువస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో ధనిక, పేద తారతమ్యం లేకుండా విద్యార్థులంతా ఒకటే అనే భావన కల్పించడంతో పాటు అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు ఉచి త దుస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏటా 1 నుంచి 10వ తరగతి(కేజీబీవీ, మోడల్ గురుకులా లు, ఇంటర్ సహా) వరకు చదువుకునే పిల్లలకు రెండు జతల దుస్తులు అందిస్తున్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 369 ఉండగా 34,053 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండేసి జతల చొప్పున 68 వేల యూనిఫాంలు అవసరం. ఏటా వేసవి సెలవులకు ముందుగానే విద్యార్థుల కొలతలు తీసుకుని దుస్తులు సిద్ధం చేసి పాఠశాలల పునఃప్రారంభం రోజు అందజేయడం ఆనవాయితీ. డీఈఓ రమేశ్ ఆధ్వర్యాన విద్యార్థుల కొలతలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూనిఫాం షర్టు భుజాలపై పట్టీలు, ఈజీ కుట్టు ఉండేలా మార్పులు చేశారు. సమగ్ర శిక్ష పర్యవేక్షణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ బాధ్యతలు అప్పగించారు.
ప్యాంట్ కావాలంటున్న విద్యార్థులు
స్కూల్ యూనిఫాం
డిజైన్లు విడుదల చేసిన సర్కారు
ఆరు.. ఏడు తరగతులకు నిక్కర్లే..
మహిళా సంఘాలకు స్టిచ్చింగ్ బాధ్యతలు
జిల్లాకు 68వేల జతలు అవసరం
నిక్కర్‌పై విద్యార్థుల అలక..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రెండేసి జతల యూనిఫాం అందిస్తోంది. ఇందులో 6, 7 తరగతుల పిల్లలకు నిక్కర్ అందజేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే.. ఐదవ తరగతి వరకే పిల్లలం.. 6కు అప్‌గ్రేడ్ అవుతున్నా ఇంకా నిక్కరేనా అంటూ పలువురు విద్యార్థులు అలకబూనుతున్నారు. గత ఏడాది కూడా రెండు నిక్కర్ల కోసం ప్రభుత్వం క్లాత్ పంపించగా పలు పాఠశాలల్లో పిల్లల అభిప్రాయాల మేరకు రెండూ కలిపి ఒకే ప్యాంట్ స్టిచ్చింగ్ చేయించారు. ఆ సమయంలో అన్ని మండలాల నుంచి ప్యాంట్ కోసం క్లాత్ పంపించాలని విజ్ఞాపనలు పంపినా.. ఈసారి కూడా నిక్కర్ డిజైన్ నమూనాను విడుదల చేశారు. దీంతో పిల్లల నుంచి వ్యతిరేకత రావడంతో ఎంఈఓలు డీఈఓలకు ప్యాంట్ క్లాత్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అర్జీ పెట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment