రంజాన్ మాసం పవిత్రమైనది
జనగామ రూరల్: రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. జిల్లా కేంద్రం గిర్నిగడ్డలోని ఏక్ మినార్ మక్కా మసీదులో రంజాన్ సందర్భంగా మహమ్మద్ జమా ల్ షరీఫ్ ఆధ్వర్యాన గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో ఏసీపీ పండారి నితిన్ చేతన్, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై రాకేష్‌తో కలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. మానవాళికి శాంతిని చేకూర్చే మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరనీయమని అన్నారు. అందరూ కలిసిమెలిసి జీవిస్తూ దేశ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంకుశావలి, తహసీన్, ఖలీల్, అహ్మద్‌షరీఫ్, కలీమొద్దీన్, ముజ్జు, ఆసీఫ్, మొహియుద్దీన్, ఇర్షాద్, అబ్దుల్ మన్నాన్, సల్మాన్ , ముఫ్తీ మౌలానా అన్సార్ తదితరులు పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్రనాయక్
Comments
Please login to add a commentAdd a comment