● జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్
స్టేషన్‌ఘన్‌పూర్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూ రు చేసిన మినీ డెయిరీ యూనిట్లను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువైద్యాధి కారి డాక్టర్ రాధాకిషన్ అన్నారు. మండల పరిధి వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానిక పశువైద్యశాలలో మెడికల్ కిట్లను గురువారం పంపి ణీ చేసి మాట్లాడారు. తాటికొండకు 5 యూనిట్లు, మీదికొండ, ఛాగల్లు, పాంనూర్, నమిలిగొండ గ్రా మాలకు ఒక్కో యూనిట్ మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో ఘన్‌పూర్ ఏడీ డాక్టర్ చక్రధర్, మండల పశువైద్యాధికారి డాక్టర్ మౌనిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment