సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల16న స్టేషన్‌ఘనపూర్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి మంజూరైన రూ.816 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. మహిళా సాధికారత దిశగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సౌర విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్‌ల శంకుస్థాపనకు కార్యాచరణ రూపొందించా లని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం పర్యటన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఏసీపీ భీంశర్మ, డీఆర్డీఓ వసంత, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, డీపీఓ స్వరూప, హౌసింగ్ పీడీ మాత నాయక్, విద్యుత్ ఎస్‌ఈ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభాస్థలి పరిశీలన
రఘునాథపల్లి: సీఎం పర్యటన నేపథ్యంలో మండలంలోని గోవర్ధనగిరి సమీపాన ఏర్పాటు చేయను న్న సభాస్థలిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అధికారులు గురువారం పరిశీలించారు. సభకు ఈ స్థలం అనువుగా ఉంటుందా..? వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి.. పార్కింగ్ తదితర అంశాలపై అధికారులు, నాయకులతో చర్చించారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం
గోవర్ధనగిరి సమీపంలో
సభాస్థలి పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment