ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే అనుమతి
జనగామ: ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న స్థలాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు లభిస్తాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో పురపాలిక ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ విక్రయ దారులకు ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈనెల 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి 25 శాతం రాయితీ పొందాల ని సూచించారు. జిల్లా నుంచి 62వేల అప్లికేషన్లు రాగా మున్సిపాలిటీ పరిధిలో 16వేలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 3వేల దరఖాస్తులు పరిష్కరించామని చెప్పారు. అనధికార వెంచర్లలో కొనుగో లు చేసి, 10 శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులు మిగతా వాటిని కూడా రిజిస్ట్రేష న్ చేసుకుని ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25 శాతం రాయితీ పొందాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై సందేహాలను నివృత్తి చేయడానికి మున్సిపాలిటీ, కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, 9948187334, 8978207205 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫోన్ల ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ ఎస్‌ఎంఎస్‌లు రాకుంటే హెల్ప్‌డెస్క్‌ల ద్వారా సమాచారం పొందవచ్చని, దరఖాస్తు తిరస్కణకు గురైతే ఫీజు లో 10 శాతం మినహాయించి మిగతా సొమ్ము తిరిగి ఇస్తామని వివరించారు. సదస్సులో ఆర్డీఓ గోపీరాం, డీటీసీపీఓ వీరస్వామి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
మార్చి 31 వరకు 25 శాతం ఫీజు రాయితీ
సదస్సులో కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment