సెకండియర్ పరీక్షలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండియర్ పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యా యి. 4,185 మంది విద్యార్థులకు 4,092 మంది (97.8 శాతం) పరీక్ష రాసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. జనరల్ కోర్సుల విద్యార్థులు 3,137 మందికి 3,094 మంది, ఒకేషన ల్ 1,058 మందికిగాను 938 మంది హాజరయ్యార ని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
మొదటి రోజు 97.8 శాతం హాజరు
సెకండియర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment