జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి
జనగామ రూరల్: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ అన్నారు. జనగామ మండల గౌడ సంఘం ఆధ్వర్యాన గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో కల్లుగీత వృత్తి దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలి వెంకన్నతో కలిసి మాట్లాడారు. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీనుల జీవనస్థితి మెరుగుపడాలని, వారు రాజకీయంగా ఎదగాలని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తపన పడ్డారని పేర్కొన్నారు. జిల్లాకు ‘పాపన్న గౌడ్’ పేరు పెట్టాలనే డిమాండ్‌తో ఈనెల 21న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బహుజన కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నామాల శ్రీనివాస్, పెంబర్తి మాజీ సర్పంచ్ అంబాల ఆంజనేయులు, మెరుగు బాలరాజు, దూడల సిద్ధయ్య, కన్నా పరశురాములు, గడ్డం మనోజ్‌కుమార్, మార్క ఉపేందర్, సిద్ధు, నరేందర్, రఘునా థ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ ఐక్య సాధన సమితి
రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్
Comments
Please login to add a commentAdd a comment