మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
జనగామ రూరల్: మహిళలు చట్టాలను తెలుసు కోవడంతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ఇంట ర్నేషనల్ ఉమెన్స్ డే ను పురస్కరించుకొని గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన పట్టణంలోని మహాత్మాగాంధీ పూలే ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పనిచేస్తున్న ప్రదేశంలో పదిమందితో కూడిన ఒక కమిటీ ఉండాల ని, అందులో సగం మంది మహిళలు ఉండాల ని చెప్పారు. మహిళలకు ఏదైనా సమస్య వస్తే ఆ కమిటీ ముందు రాతపూర్వకంగా చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిహారం చట్టం–2013 గురించి వివరించారు. అలాగే వరకట్న నిషేధ చట్టం, వివాహ మహిళ తన భర్త ఇంట్లో ఉండే హక్కు గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆడపిల్లలు పోరాడే శక్తి కలిగి ఉండాలని, ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీంద్ర, అధ్యాపకులు లావణ్య, జి.శివప్రసాద్, ఇందిర, శైలజ, ఉషారాణి, మానస తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment